![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 07:40 PM
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వమే సన్నబియ్యం పంపిణీ చేస్తోందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. రాష్టంలో సన్నబియ్యం బీజేపీనే ఇస్తే.. దేశం మొత్తం ఎందుకు ఇవ్వట్లేదని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన చేశారు. బండి సంజయ్‌లో రోజురోజుకీ అభద్రతా భావం పెరుగుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.