![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 12:50 PM
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి సన్నిధానంలో సోమవారం సాధారణ భక్తుల రద్దీ నెలకొంది. కోడె టికెట్ల కోసం భక్తుల గంటల తరబడి క్యూలైన్ లో వేచి చూశారు. అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. నిన్నటి రోజు సీతారాముల కళ్యాణం నేపథ్యంలో వచ్చిన భక్తులు. సోమవారం స్వామివారిని దర్శించుకొని సేవలో తరించారు. అందరిని చల్లగా చూడు రాజన్న స్వామి అంటూ భక్తజనం వేడుకున్నారు.దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.