![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 12:58 PM
పోలీసులు పెన్ పహాడ్ మండలంలోని ప్రజలకు అందుబాటులో ఉండి తమ సేవలను అందించాలని సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి అన్నారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ ను సీఐ రాజశేఖర్ తో కలిసి సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం వేసవికాలం అయినందున దొంగల బెడద ఉంటుందని కావున సిబ్బంది ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహించాలన్నారు. ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహించాలని సిబ్బందికి తెలిపారు.