![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 01:02 PM
మేడ్చల్‌లో రైల్వే ట్రాక్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని.. కీచకుల నుంచి తప్పించుకుని మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన యువతి. ఇటీవల ఎంఎంటీఎస్ రైలు అత్యాచారం మరవకముందే మరో యువతి పై అత్యాచార యత్నానికి దుండగులు ప్రయత్నించారు. ఆదివారం రాత్రి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. దుండగులు యువతి పై అఘాయిత్యానికి యత్నించగా రాయితో కొట్టి వారి బారి నుండి తప్పించుకొని మేడ్చల్ పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలం చేరుకొని మేడ్చల్ పోలీసులు విచారణ జరిపి యువతి ఫిర్యాదు మేరకు 305 కేసు నమోదు చేసి మేడ్చల్ పోలీసులు రైల్వే పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.