![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 03:40 PM
రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటివరకు 9 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. వారం రోజుల్లో గడువు ముగియనుండగా.. మొత్తంగా 20 లక్షల అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మే 31లోగా అర్హులను స్కీనింగ్ చేసి కలెక్టర్ల ఆమోదానికి అధికారులు పంపనున్నారు. జూన్ 2న అర్హులకు రుణాలు మంజూరు చేయనున్నారు. లబ్దిదారులకు గరిష్టంగా రూ.4 లక్షల సాయం అందనుంది.