![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 03:53 PM
మహిళ మెడలో నుంచి చైన్ కాజేసిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉప్పల్లోని విజయపురి కాలనీలో నివాసముంటున్న విజయలక్ష్మి అనే మహిళ సరస్వతి కాలనీలో ఉదయం పాలు అమ్ముతుంది.
బైక్ పై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పాలు కొనుక్కునేలా నటించి మెడలో ఉన్న చైన్ లాక్కొని వెళ్ళాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థానానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.