![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 11:37 AM
తెలంగాణ పాలీసెట్-2025 నోటిఫికేషన్ విడుదలైంది. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 19 నుంచి ఏప్రిల్ 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250 దరఖాస్తు ఫీజు ఉంటుంది. రూ.100 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 21 వరకు, రూ.300 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 23 వరకు దరఖాస్తు చేసుకోవొచ్చు. ఇక, మే 13న ప్రవేశ పరీక్ష ఉంటుంది.బయోమెడికల్, డీ ఫార్మసీ, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, కంప్యూటర్ ఇంజినీరింగ్, సీసీపీ, డీసీఈ, డీఎంఈ తదితర డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్ మూడు సంవత్సరాలు కోర్సు పూర్తయిన వెంటనే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. పదో తరగతి తరువాత తక్కువ కాలంలో కేవలం పాలిటెక్నిక్ కోర్సులతోనే కెరీర్‌లో స్థిరపడొచ్ఛు పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ రెండునుంచి ఉచితశిక్షణ, ఉచిత మెటీరియల్ ఇస్తామని పాలిసెట్ నెల్లూరు జిల్లా కన్వీనర్ ఏసుదాస్ తెలిపారు.