![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 11:44 AM
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో రైల్వే అండర్ పాస్ వద్ద బీటీ రోడ్డు పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రారంభించారు. నిర్మాణం జరుగుతున్న బీటీ రోడ్డు వద్ద కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ ఆలేరు నుండి కొలనుపాక రోడ్డు వద్ద గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిలిచిపోయిన అండర్ పాస్ బ్రిడ్జి పనులను ప్రారంభించి ఈ ప్రజాప్రభత్వం లో పూర్తి చేశామన్నారు. దానితో పాటు బీటీ రోడ్డు పనులను కూడా ప్రారంభించారని తెలిపారు.