![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 12:54 PM
మియాపూర్ మెట్రో పిల్లర్ 600 వద్ద యూ టర్న్ తీసుకుంటుండగా అంటూ వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది ఈ ప్రమాదం లో ట్రాఫిక్ కానిస్టేబుల్ సింహాచలం మృతి, మరొకరికి తీవ్ర గాయాలు.రాత్రి విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైకి ఒక లారీ దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలయ్యాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం రాత్రి సమయంలో మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వికేందర్, రాజవర్ధన, సింహాచలం నో ఎంట్రీ విధుల్లో ఉన్నారు. కూకట్పల్లి నుంచి మియాపూర్ వైపు వేగంగా వస్తున్న ఓ లారీ యూటర్న్ సమీపంలో అదుపు తప్పి ట్రాఫిక్ అంబ్రెల్లాను ఢీ కొట్టింది. ఈ సమయంలో అంబ్రెల్లా వద్ద ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే సహచర పోలీసులు.. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన సింహాచలం చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్ల ఆరోగ్య పరిస్థితి.. ప్రస్తుతానికి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్.. ఘటనాస్థలి నుంచి పరారయ్యాడు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.