![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 01:15 PM
బ్రహ్మకుమారి చీఫ్ అడ్మినిస్ట్రేటర్ దాది రతన్ మోహిని (100) కన్నుమూశారు. అనారోగ్యానికి గురి కావడంతో అహ్మదాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మరణించారు.
1925 మార్చి 25న జన్మించిన దాది రతన్ మోహిని 100 ఏళ్లు దాటిన రెండో బ్రహ్మకుమారిగా రికార్డు నెలకొల్పారు. తన సేవా కార్యక్రమాలతో దాది రతన్ అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.