![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 02:07 PM
ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే పార్టీ రజతోత్సవ బహిరంగ సభను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మంగళవారం పట్టణంలో సభకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించి మాట్లాడుతూ 27న ప్రతి పల్లె, పట్టణంలో గులాబీ జెండా ఎగరేయాలన్నారు. ఈ కార్యక్రమంలో లోక్య నాయక్, జనార్దన్ రావు, రాజేష్, శంకర్ నాయక్, రవీందర్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.