![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 02:09 PM
జాతీయ రహదారిపై వెళుతున్న కోడిగుడ్ల వ్యాన్ నేరడిగొండలోని కొరటికల్ వద్ద ఉన్న డౌనల్ ప్రాంతంలో మంగళవారం బోల్తా పడింది. ఆర్మూర్ నుంచి మహారాష్ట్రలోని సర్కనికి కోడిగుడ్లతో వెళుతున్న వ్యాన్ ఓ బైక్‌ను తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి బోల్తాపడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో వ్యాన్ లోని కోడిగుడ్ల ట్రేలు రోడ్డుపై చిందరవందరగా పడిపోయాయి. వ్యాన్‌లోని కోడిగుడ్లు అన్ని పగిలిపోయాయని, ఇద్దరికి స్వల్పగాయలైనట్లు వెల్లడించారు