![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 10:55 AM
కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ బస్టాండ్ లో గురువారం షీటీం ఆధ్వర్యంలో మహిళల భద్రత కోసం డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. షీ టీం ఎస్ఐలు వెంకటేశ్వర్లు, శిరీష బస్టాండు ప్రాంతాల్లో మఫ్టీలో తిరుగుతూ పర్యవేక్షించారు. పాఠశాల విద్యార్థినులను ఇబ్బంది కలిగించిన ఆకతాయిలను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎవరైనా మహిళలు, విద్యార్థినులు ఆకతాయిలా వేధింపులకు గురైనట్లయితే 100కు చేయాలన్నారు.