![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 10:40 AM
తెలంగాణలో మరో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న యువతి, యువకుడిని శుక్రవారం ఉదయం కారు ఢీ కొట్టింది. అక్కడిక్కడే యువతి మృతి చెందగా, యువకుడికి తీవ్రగాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. బైక్‌ను కారుతో ఢీకొట్టి పరారైన వ్యక్తిపై కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.అయితే బైక్‌ను ఢీకొట్టిన తరువాత కోహెడ నుంచి చైతన్యపురి వస్తుండగా ప్రదీప్ కారుపై పోలీసులకు అనుమానం వచ్చింది. కారు అద్దం పగలడం, అనుమానాస్పదంగా డ్రైవ్ చేస్తుండటంతో ప్రదీప్ కారును చైతన్య పురి పోలీసులు అడ్డగించారు. కారును ఆపి ప్రశ్నించారు. కారు డ్యామేజ్ అయ్యింది.. రిపేర్‌కి వెళ్తున్నానని ప్రదీప్ బుకాయించే ప్రయత్నం చేశాడు. అద్దంపై రక్తపు మరకలు, జుట్టు ఉండటంతో.. అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. కోహెడ వద్ద ప్రమాదం జరిగినట్లు సమాచారం రావడంతో.. అక్కడ యాక్సిడెంట్ చేసింది ఈ కారే అని చైతన్యపురి పోలీసులు గుర్తించారు.