![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 12, 2025, 12:29 PM
బుడగ జంగాల కుటుంబంలో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సన్న బియ్యంతో భోజనం.యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో బుడగ జంగాల కుటుంబంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంతో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు భోజనం చేశారు.ఈ సందర్భంగా వారి ఇంట్లో భోజనం చేస్తూ సన్నబియ్యం పథకంతో పాటు ఇతర పథకాలు ఎలా ఉన్నాయో మహిళలను అడిగి తెలుసుకున్నారు.ఈ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేస్తునట్లు తెలిపారు.ఈ సన్నబియ్యం తింటూ ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.