![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 12, 2025, 12:16 PM
హరితహరం బ్రాండ్ అంబాసిడర్ వనజీవి రామయ్య కన్నుమూత. కోటి మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరుగాంచిన వనజీవి రామయ్య ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి. ఆయన సేవలకు కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.వనజీవి రామయ్య అసలు పేరు దరిపల్లి రామయ్య. వృక్షో రక్షతి రక్షితః అంటూ మొక్కల పెంపకాన్ని ప్రచారం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం హరితహారంలో ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఇంటికి ఎవరు వచ్చినా ఒక మొక్కను గిఫ్ట్ గా ఇచ్చేవారు. ఆయన కృషిని గౌరవిస్తూ ప్రభుత్వం 6వ తరగతి పాఠ్యాంశాల్లో రామయ్య జీవితాన్ని చేర్చింది.