![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 12, 2025, 12:12 PM
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు, దిశ కమిటీ చైర్మన్ డా. కడియం కావ్య అన్నారు..శుక్రవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, డీఆర్డీఏ వసంత లతో కలిసి ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు, దిశ కమిటీ కో-కన్వీనర్ చామల కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు, దిశ కమిటీ ఛైర్మన్ కడియం డా. కావ్య అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా సామాజిక తత్వవేత్త, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే 199వ జయంతిని పురస్కరించుకొని వారందరూ కలిసి జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వివిధ శాఖల అభివృద్ధి పనులకు సంబంధించిన పలు అంశాలపై అధికారులతో క్షుణ్ణంగా చర్చించి, సమీక్షించారు. ఈ సందర్భంగా *వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు, దిశ కమిటీ ఛైర్మన్ డా. కడియం కావ్య మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా ఒక్కసారి కూడా దిశ సమావేశం నిర్వహించలేదని, ఇక పై నిరంతరం దిశ సమావేశం ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బాలసదన్ లో మహిళల పట్ల ప్రత్యేక పర్యవేక్షణతో పాటు రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాన్స్ జెండర్లకు వారానికి రెండు సార్లు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా పలు శాఖల పనితీరు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు. విద్య, వైద్యం, కరెంటు, మంచినీరు, రైతుల సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు వెంటనే ఇందిరమ్మ ఇళ్లను అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు నాలాల మరమ్మతులపై చర్యలు చేపట్టాలని, అప్పుడే రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు మరింతగా కృషి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీఓ గోపీరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు..