![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 12, 2025, 12:06 PM
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్ లో 7.6 ఎకరాల విస్తీర్ణంలో 62 కోట్లతో లక్షా 73 వేల చదరపు అడుగుల పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్( టెక్స్ పోర్ట్)యూనిట్ ను శుక్రవారం చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిశ్రమ శిలా ఫలకాన్నీ ఆవిష్కరించారు. యూనిట్ లోని ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. అనంతరం యూనిట్ లోని ఉద్యోగుల తో ముచ్చటించారు. చేనేత కార్మికులకు లక్ష రూపాయల రుణ మాఫీ పూర్తి చేశామని, మహిళా సంఘాలలో ఉన్న 65 లక్షల మంది మహిళలకు ఉచిత 2 చీరలు పంపిణీ చేయాలనే నిర్ణయించి ఆ ఆర్డర్ ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.ఈ ప్రాంతంలో కాటన్ పరిశ్రమ, పాలిస్టర్ పరిశ్రమ, అనుబంధ రంగ పరిశ్రమలు తీసుకొని రావాలని, ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని ఆయన మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల చిరకాల కోరిక నూలు డిపోను కూడా వేములవాడ పట్టణంలో 50 కోట్లతో ఏర్పాటు చేసుకున్నామని, దీని వల్ల 99 సంఘాలకు ఇప్పటివరకు సబ్సిడీ పై నూలు అందించామని అన్నారు. అనంతరం పరిశ్రమలో శిక్షణ పొందిన మహిళలకు నియామక పత్రాలు అందజేశారు.