|
|
by Suryaa Desk | Sat, Apr 12, 2025, 10:05 PM
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో ప్రభుత్వం ఈ భూములను తనఖా పెట్టి రుణం పొందినట్లు చెప్పిందని, అయితే ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం తాము తనఖా పెట్టుకోలేదని ప్రకటన విడుదల చేసిందని గుర్తు చేశారు. ఆ 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూములను ప్రభుత్వం ఎవరి వద్ద తనఖా పెట్టిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బ్రోకర్ కంపెనీలకు తనఖా పెట్టారా? 400 ఎకరాల తనఖా విషయంలో దాగి ఉన్న చీకటి కోణం ఏమిటి? అని హరీశ్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.