|
|
by Suryaa Desk | Sat, Apr 12, 2025, 10:08 PM
హనుమాన్ జయంతి, ఐపీఎల్ మ్యాచ్ కారణంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. గౌలిగూడ శ్రీరామ మందిరం నుంచి తాడ్‌బండ్ వరకు హనుమాన్ ర్యాలీ కొనసాగుతోంది. మధ్యాహ్నం ప్రారంభమైన ఈ ర్యాలీ రాత్రి ఎనిమిది గంటల వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర సాగనుంది.మరోవైపు, రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రీడా మైదానంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.