|
|
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 12:55 PM
డా. బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని భువనగిరి పట్టణంలోని వినాయక చౌరస్తాలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు ఘనంగా నివాళులర్పించారు.అనంతరం భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ చౌరాస్తాలో అంబెడ్కర్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ర్యాలీని ముఖ్యఅతిథిగా హాజరై బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి దండ వేసి నివాళులర్పించి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు మాట్లాడుతూ.ఆర్థికవేత్త రాజా నీతిజ్ఞుడు భారత రాజ్యాంగ రూపకర్త మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి భువనగిరి పట్టణంలో పూలమాలవేసి నివాళులర్పించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు.యావత్ భారత్ మొత్తం రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలని ఈ సందర్భంగా కోరుకున్నారు.