|
|
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 12:48 PM
బడుగు బలహీన,అనగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన యోధుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్ సీపీఐ మండల కార్యదర్శి ఉట్కూరి నరసింహ అన్నారు. సోమవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా రామన్నపేట మండల కేంద్రంలో సిపిఐ మరియు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.