|
|
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 08:34 PM
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేసవి సెలవులు త్వరలోనే రానున్నాయి. మరికొన్ని రోజుల్లో ఎండా కాలం సెలవుల్లో ఎంజాయ్ చేయనున్నారు విద్యార్థులు. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు 2025 వేసవి సెలవుల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. విద్యా సంవత్సరం ముగియడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ వేసవి సెలవుల్లో టూర్లు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.తెలంగాణ విద్యా శాఖ జారీ చేసిన విద్యా క్యాలెండర్ ప్రకారం.. తెలంగాణలోని పాఠశాలలకు వేసవి సెలవులు ఏప్రిల్ 24, 2025 నుండి ప్రారంభమవుతున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ఇక పాఠశాలలు జూన్ 12, 2025న తిరిగి తెరుచుకుంటాయని తెలిపింది. దీని వలన పాఠశాల విద్యార్థులకు 46 రోజుల వేసవి సెలవులు లభిస్తాయి.విద్యా సంవత్సరం క్యాలెండర్ ప్రకారమే షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు వెల్లడించింది. కాగా వేసవి సెలవులపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ ప్రకటన జారీ చేసింది. ఏప్రిల్ 23 లోపు పరీక్షలు పూర్తవ్వనున్న నేపథ్యంలో అదే రోజు పరీక్షా ఫలితాలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ 24 నుంచే వేసవి సెలవులు ప్రకటించింది.