|
|
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 08:50 PM
బీజేపీ నాయకుడు చికోటి ప్రవీణ్ కుమార్‌పై నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేశారు. నల్గొండ పోలీసులు ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉంది.రెండు రోజుల క్రితం హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో స్థానిక బీజేపీ నేతలు శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో చికోటి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. చికోటి ప్రవీణ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేయడంపై స్థానిక బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.