|
|
by Suryaa Desk | Tue, Apr 15, 2025, 11:09 AM
కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని, ఫీజు రూపంలో తమను దోచుకుంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు. ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తున్నందున ఫీజు తగ్గించడం కుదరదని తేల్చి చెప్పిన విద్యాశాఖ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2011 నుండి 2017 వరకు రూ.200 ఉండేది, 2021లో రూ.300, 2023లో రూ.440కు పెంచారు . కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల వద్ద ఫీజు రూపంలో భారీ దోపిడికి పాల్పడుతుందని, తాము అధికారంలోకి వస్తే టెట్ ఫీజు తగ్గిస్తామని, ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక రూ.440 ఉన్న ఫీజును ఏకంగా రూ.1000 కి పెంచేసిన రేవంత్ సర్కార్ . రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల మంది టెట్ పరీక్ష రాస్తున్నారని, రూ.1000 ఫీజు అంటే అనేక మంది పరీక్ష రాయడానికి వెనకడుగు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు. అధికారంలోకి రావడానికి ఆరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేసి, టెట్ ఫీజును వెంటనే తగ్గించాలని కోరుతున్న నిరుద్యోగులు