|
|
by Suryaa Desk | Tue, Apr 15, 2025, 11:16 AM
విమానంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి. శనివారం అర్థరాత్రి ఇండిగో విమానంలో ప్రయాణిస్తుండగా మూర్చపోయి, నోట్లో నుండి ద్రవం కారుతూ తీవ్ర అనారోగ్యానికి గురైన 74 ఏళ్ల వృద్ధుడు. బీపీ తక్కువగా ఉందని నిర్ధారణకు వచ్చి వెంటనే సీపీఆర్ చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడిన డాక్టర్ ప్రీతి రెడ్డి. విమానం హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే.. ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వృద్ధుడిని అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించారు. ఒకరి ప్రాణాలను కాపాడిన డాక్టర్ ప్రీతి రెడ్డి మానవత్వాన్ని , వృత్తిపరమైన నిబద్ధతను తోటి ప్రయాణికులు.. విమాన సిబ్బంది ప్రశంసించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆమె చూపిన చొరవ.. సమయస్ఫూర్తి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాయి.