|
|
by Suryaa Desk | Tue, Apr 15, 2025, 03:12 PM
తెలంగాణలో మహిళా సంఘాలపై BRS మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్వయం సహాయక బృందాలకు (SHG) రుణాలు ఇచ్చే 'శ్రీనిధి' నిర్వహణ అస్తవ్యస్తంగా మారడం దురదృష్టకరమని అన్నారు.
మొత్తం రుణాలలో 40 శాతం వాటా NPA ఉండటం శ్రీనిధి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోందని చెప్పారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని, IAS అధికారికి బాధ్యతలు అప్పగించి శ్రీనిధి భవిష్యత్తును కాపాడాలని BRS తరఫున డిమాండ్ చేశారు.