|
|
by Suryaa Desk | Tue, Apr 15, 2025, 04:03 PM
పటాన్చెరు : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నేడు నిరుపేదలకు వరంగా మారాయని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాలు, పట్టణాలు, డివిజన్ల పరిధిలోని 272 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన రెండు కోట్ల 72 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.