|
|
by Suryaa Desk | Tue, Apr 15, 2025, 07:28 PM
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని బేగంబజార్, కోఠి, బషీర్‌బాగ్, నాంపల్లి, లక్డీకాపూల్, ట్యాంక్‌బండ్, అమీర్‌పేట, ఖైరతాబాద్, ప్యాట్నీ, మారేడుపల్లి ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.