|
|
by Suryaa Desk | Wed, Apr 16, 2025, 12:43 PM
నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే జిల్లా సమన్వయ పర్యవేక్షణ కమిటి (దిశ) సమావేశమునకు సంబంధిత శాఖ అధికారులు సరైన జాబితా, పూర్తి సమాచారంతో రావాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళ వారం మినీ మీటింగ్ హాలులో జరిగే దిశ మీటింగ్ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించబడుతున్నందున కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు జరిగే పథకాల పై 2024-2025. (01.07.2024 నుండి 31.03.2025) ఆర్థిక సంవత్సరమునకు సంబందించిన పూర్తి సమాచారం తయారు చేసుకొని సమా వేంకు సకాలంలో హాజరు కావాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈవో శోభారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగి రెడ్డి, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.