|
|
by Suryaa Desk | Wed, Apr 16, 2025, 12:19 PM
బజార్హత్నూర్ లోని రైతువేదికలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన 42 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం లక్షతో పాటు తుళం బంగారం కూడా అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు