|
|
by Suryaa Desk | Wed, Apr 16, 2025, 01:04 PM
భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రతీ మండలంలో ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ బుధ వారం అధికారులను ఆదేశించారు. అవగాహన కార్యక్రమాల నిర్వహణకు షెడ్యూల్ తయారు చేయాలని సూచించారు. భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి కలెక్టర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈనెల 17నుంచి 30వ తేదీ వరకు ప్రతి మండలంలో కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అన్నారు.