|
|
by Suryaa Desk | Wed, Apr 16, 2025, 08:38 PM
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై చట్టప్రకారం తాము ముందుకు వెళతామని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫొటోను షేర్ చేసినందుకు పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయడంపై ఆయన ఈ విధంగా స్పందించారు.కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని మంత్రి తెలిపారు. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని గుర్తు చేశారు. నకిలీ వీడియోలు, ఫొటోలు అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భూముల విషయం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఏమీ మాట్లాడలేమని పేర్కొన్నారు. నెమళ్లు జనావాసాల్లోకి రావడం సహజమేనని అన్నారు.