|
|
by Suryaa Desk | Wed, Apr 16, 2025, 08:41 PM
బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ బుధవారం తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఇటీవలే ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, పద్మారావుగౌడ్ తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ గా ప్రమాణం చేసిన తర్వాత దాసోజు శ్రవణ్ ర్రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ లో మీడియాతో మాట్లాడారు. పద్దెనిమిదేళ్లు రాజకీయ కార్యకర్తగా ఉన్నానని,ఎమ్మెల్సీ గా అవకాశమిచ్చి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు రాజకీయ పునర్జన్మ ఇచ్చారన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ ,మాజీ మంత్రి హరీష్ రావు ,ఎమ్మెల్సీ కవితలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ గా తనకు దక్కిన ఈ అవకాశాన్ని కేసీఆర్ మూడో సారి సీఎం అయ్యేందుకు వినియోగిస్తానన్నారు.