|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 10:53 AM
హైదరాబాద్ పటాన్ చెరు సమీపంలోని ఇక్రిశాట్‌లో చిరుత కలకలం రేగింది. రెండు మూడు రోజులుగా ఇక్రిశాట్ పరిశోధన క్షేత్రాల్లో చిరుత సంచరించింది. సిబ్బంది ఫిర్యాదుతో అటవీశాఖ అధికారులు బుధవారం ఉదయం సీసీ కెమెరాలు, బోను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున అది బోనులో చిక్కింది. ఎట్టకేలకు చిరుత పట్టుబడటంతో శాస్త్రవేత్తలు, సిబ్బంది, కూలీలు ఊపిరి పీల్చుకున్నారు. చిరుత పులిని హైదరాబాద్ జూ పార్కుకు తరలించనున్నారు.