|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 04:04 PM
బిజినేపల్లి మండలం కీమ్యాతండా లో గంగారం ఫారెస్టు పరిధిలో ఉన్న అడవిలో నుంచి ఓ జింక తండాలోకి బుధవారం రాత్రి ప్రవేశించింది. ఊరకుక్కలు దాడిచేయడంలో జింక మృతి చెందింది.
గురువారం జింక కళేబరం కనిపించడం వల్ల అధికారుల పర్యవేక్షణలోపంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. ఫారెస్ట్ లో నీరు లేక గ్రామాల వైపు జింకలు వస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు.