|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 05:09 PM
ఓ వ్యక్తి క్రూర మృగంలా ప్రవర్తించాడు. మూగజీవాల పట్ల కర్కశత్వంగా వ్యవహరించారు. రోజుల వయసు ఉన్న ఐదు కుక్క పిల్లలను అతి కిరాతకంగా చంపేశాడు. కుక్క పిల్లలను నేలకేసి కొట్టి రాక్షసానందం పొందాడు. కుక్క పిల్లలు చనిపోవడాన్ని గమనించిన స్థానికులు ఆ అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ఈ విషయం వెలుగు చూసింది. హైదరాబాద్ ఫతేనగర్‌లోని హోమ్ వ్యాలీలో ఈ ఘటన జరిగింది. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో తన పెంపుడు కుక్క దగ్గరకు వీధి కుక్క వచ్చిందని దాని ఐదు పిల్లలను చంపేశాడో దుర్మార్గుడు. ఆ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వ్యాపారి ఆశిష్ ఈ దారుణానికి పాల్పడినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా తెలిసింది. దాంతో అతనిపై అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక, ఈ ఘటన తాలూకు వీడియో బయటకు రావడంతో జంతుప్రేమికులు, నెటిజన్లు సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూగజీవాల పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించడం ఏంటని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.