|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 09:33 PM
కేటీఆర్ మతి భ్రమించి ప్రజా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. ధరణి స్కామ్ డబ్బులతో ఎమ్మెల్యేలను కొనాలన్నది కేటీఆర్ ఉద్దేశమని ఆయన ఆరోపణలు చేశారు.
పేదలకు సన్నబియ్యం ఇస్తూ పేదోడికి బువ్వ పెడుతుంటే ఓర్వలేక కేటీఆర్ ప్రభుత్వాన్ని పడగొడతామని నీచాతి నీచంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలను ప్రజలు సహించరని అన్నారు.