|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 09:55 PM
పెద్దపల్లి జిల్లాల్లో ప్రతిపాదించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి యాసంగి పంట ధాన్యం.
కొనుగోలుపై అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ వేణు పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో జిల్లాలో వెంటనే ప్రారంభించాలన్నారు.