|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 10:30 AM
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం గోపాల్ పేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆకస్మిక వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు కవర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్యక్రమం స్థానిక కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.