|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 11:40 AM
మధ్యప్రదేశ్‌లో దారుణమైన హత్య కేసు వెలుగు చూసింది. గోల్డెన్ పాండే అనే మహిళ తన భర్తను హైవే రోడ్డుపై పగిలిన బీరు సీసాతో 36 సార్లు పొడిచి హత్య చేసింది. అనంతరం తన ప్రియుడికి వీడియో కాల్ చేసి మృతదేహాన్ని చూపించిందని పోలీసులు తెలిపారు. ఆ మృతదేహాన్ని ఇండోర్‌లోని ఐటీఐ కాలేజీ సమీపంలో పడేసినట్టు గుర్తించారు. ఈ హత్యలో ఆమెకు ఇద్దరు స్నేహితులు సహకరించినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు