|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 02:27 PM
మేడ్చల్ జిల్లా గాజులరామారంలో గురువారం ఇద్దరు పిల్లలను నరికి చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన విషయలు వెలుగులోకి వచ్చాయి. ఆశిష్, హర్షిత్ కి శ్వాసకోశ సమస్యలు ఉండటంతో ప్రతి 3, 4 గంటలకు ఒకసారి డ్రాప్స్ వేయాలి.
దీంతో తేజస్విని మానసికంగా కుంగిపోయినట్లు సమాచారం. అయితే పిల్లల మెరుగైన వైద్యానికి భర్త సహకరించట్లేదని, ఎంత ఆస్తి ఉన్నా పిల్లలకు పనికిరాకుండా పోతోందని అని ఆమె సూసైడ్ నోట్ రాసింది. భర్త కోపంతో కసురుకుంటాడని అందులో పేర్కొంది.