|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 02:39 PM
మీ సేవలు అమోఘం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అగ్నిమాపక భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని, శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసిన మేఘా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, రక్తదాతలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసాపత్రాలను ఎమ్మెల్యే అందజేశారు.