|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 02:36 PM
నడిగడ్డ ప్రజల ఇలవేల్పు జమ్మిచేడు జమ్ములమ్మకు శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కృష్ణా నది జలాలతో అమ్మవారిని అభిషేకించి, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు.
అనంతరం అర్చన, ఆకుపూజ, హోమం, తదితర పూజలు జరిపారు. పరిసర ప్రాంతాల, కర్ణాటక, రాయలసీమ ఇతర ప్రాంతాల భక్తులు వచ్చి దీపాల కాంతుల్లో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.