|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 03:30 PM
వివాహేతర సంబంధం పై ప్రశ్నించిన భార్యపై గొడ్డలితో దాడి చేసిన ఘటనలో నిందితుడు భర్తను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై రాజేందర్ శుక్రవారం తెలిపారు.
కోటపల్లి మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన భానోత్ పున్నం తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్న భార్య లక్ష్మిని గొడ్డలితో దాడి చేసి గాయపరిచాడు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై వెల్లడించారు.