|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 03:41 PM
మావల మండల కేంద్ర శివారులో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను సీపీఎం ఏరియా కమిటీ సభ్యులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల సమస్యలపై సర్వే నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కూలీలకు పని ప్రదేశాలలో వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీల డబ్బులను పెండింగ్ లో ఉంచకుండా వెంటనే చెల్లించాలన్నారు. నాయకులు స్వామి, గంగారం, వికాస్, తదితరులు ఉన్నారు.