|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 03:46 PM
గుడ్ ఫ్రైడే సందర్భంగా నెరడిగొండ మండల కేంద్రంలో గల చర్చ్ లో నిర్వహించిన వేడుకలకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చ్ ఫాథర్ ఎమ్మెల్యేను సన్మానించారు.
అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ చర్చ్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. అందరూ కలిసి మెలసి ఉండాలని పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, పీఏసీఎస్ చైర్మన్ నానక్ సింగ్, రాథోడ్ సురేందర్, ప్రతాప్ ఉన్నారు.