|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 04:23 PM
సిర్పూర్ టీ, మండల కేంద్రంలోని మీని ట్యాంక్ బండ్ (నాగమ్మ చెరువు) వద్ద వచ్చే నెల 12న ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భగవాన్ బుద్ధుని 2569వ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు.
శుక్రవారం కాగజ్‌నగర్‌లోని కొమరంభీం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు నివాసంలో, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఉత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భగవాన్ బుద్ధుని ఉత్సవ కమిటీ సభ్యులు, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.