|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 04:28 PM
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందించే మన గ్రోమోర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నాయకులు కోరారు. శుక్రవారం తలకొండపల్లి మండల కేంద్రంలో మన గ్రోమోర్ కేంద్రాన్ని నాయకులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నకిలీ ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులతో ఎందరో రైతులు నష్టపోతున్నారని, రైతుల వినతికి స్పందించి కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.