|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 08:21 PM
నేషనల్ హెరాల్డ్ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రూ.2వేల కోట్ల ఆస్తుల కాజేయడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆరోపించారు. 2011లో యూపీఏ హయాంలో సీబీఐ దర్యాప్తు ప్రారంభమైందని.. సోనియా, రాహుల్ గాంధీలు బెయిల్ పొందారని తెలిపారు. ఈ కేసుకు బీజేపీకి సంబంధం లేదని, చట్టాలు అందరికీ సమానమని ప్రశ్నించారు.మరోవైపు రేవంత్ సర్కార్‌పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే బెంగాల్ తరహా పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయని బాంబు పేల్చారు బండి సంజయ్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఆఫీస్ లో బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రభుత్వ సహకారంతో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతాయన్నారు. ఇది కంట్రోల్ తప్పితే శాంతి భద్రత సమస్యలు తలెత్తుతాయని వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్